పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం | farmer suicide attempt in kalyana duragam | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Jan 29 2016 12:29 PM | Updated on Oct 1 2018 2:44 PM

తనకు జీవనోపాధి నిచ్చే ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

కల్యాణదుర్గం: తనకు జీవనోపాధి నిచ్చే ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎం.వెంకటంపల్లికి చెందిన సోమ శేఖర్(36) చెందిన ట్రాక్టర్ ను మూడు రోజుల క్రితం అధికారులు సీజ్ చేసి, స్టేషన్‌లో ఉంచారు. తన ట్రాక్టర్‌ను విడిపించుకోవటానికి సోమశేఖర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మనస్తాపం చెందిన అతడు శుక్రవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై పురుగు మందు తాగాడు. గమనించిన పోలీసులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement