breaking news
soma sekhar
-
ఆఖరికి శవాన్ని కూడా వదల్లేదు
సాక్షి, బనశంకరి: ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ఎస్.గిరీశ్ తెలిపారు. ఏం జరిగిందంటే... మంగళవారం డీసీపీ తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 3 న చిక్కజాలకు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి చెన్నరాయపట్టణకు ఇన్నోవా కారులో వెళ్తుండగా, చిక్కనహళ్లి వద్ద లారీ ఢీకొట్టింది. ఇన్నోవా కారు ధ్వంసం కాగా వేణుగోపాల్ తల్లి సరస్వతి దుర్మరణం చెందింది. మిగిలిన వారు గాయపడ్డారు. ఇదే మార్గంలో స్నేహితులతో విహారయాత్ర ముగించుకుని వస్తున్న యశవంతపుర బీకే. నగర నివాసి సోమశేఖర్ బాధితులకు సహాయం చేస్తున్నట్లు నటించి మృతురాలి నగలను చోరీ చేశాడు. విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. చోరీ సొత్తును హుణసమారేనహళ్లిలోని బంగారు ఆభరణాల కుదువ దుకాణంలో పెట్టడానికి సోమశేఖర్ పథకం పన్నిన్నట్లు పోలీసులు కనిపెట్టారు. వెంటనే చిక్కజాల ఇన్స్పెక్టర్ కేశవమూర్తి సిబ్బందితో దాడి చేసి సోమశేఖర్‌ను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరీశ్ తెలిపారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కల్యాణదుర్గం: తనకు జీవనోపాధి నిచ్చే ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎం.వెంకటంపల్లికి చెందిన సోమ శేఖర్(36) చెందిన ట్రాక్టర్ ను మూడు రోజుల క్రితం అధికారులు సీజ్ చేసి, స్టేషన్లో ఉంచారు. తన ట్రాక్టర్‌ను విడిపించుకోవటానికి సోమశేఖర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మనస్తాపం చెందిన అతడు శుక్రవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై పురుగు మందు తాగాడు. గమనించిన పోలీసులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. -
అనుమానం పెనుభూతమై..
మర్రిగూడ, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది .. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దారుణంగా హతమార్చాడు. ఈఘటన మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య (38) ఉదయం తన మోటార్‌సైకిల్‌పై బీసీ కాలనీకి వెళ్లాడు. కాలనీకి చెందిన గుర్రాల సోమమ్మ ఇంటిముందు బైక్‌ను ఆపి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన గొడ్డటి రాములు గొడ్డలితో వెనుకనుంచి యాదయ్యపై దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంజరుగుతుందో అని తెలుసుకునేలోపే యాదయ్య మెడపై గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అతడు కిందపడడం తో పలుమార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే రాము లు అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు మాసాల క్రితమే.. మాజీ సర్పంచ్ యాదయ్య, బీసీ కా లనీకి చెందిన రాములు మధ్య ఉన్న తగాదాలు మూడు మాసాల క్రితమే బయటపడినట్టు తెలిసింది. గతంలో యాదయ్య సర్పంచ్‌గా పోటీచేసినప్పుడు రాములు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలకు మంచి సఖ్యత ఉంది. దీంతో యాదయ్య తరచు రాములు ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే యాదయ్య తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రాములుకు కలి గింది. దీంతో అతడు యాదయ్యను ఇకపై బీసీ కాలనీకి రావొద్దని పలుమార్లు హెచ్చరించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాములు మాటలను యాదయ్య పెడచెవిన పెటక బీసీ కాలనీకి వచ్చిపోతున్న నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. వీధిన పడిన కుటుంబం మాజీ సర్పంచ్ యాదయ్య దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుం బం వీధిన పడింది. ఈయనకు భా ర్య, ఇద్దరు చిన్న వయస్సు కలిగిన కుమారులు ఉన్నారు. యాదయ్య ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సర్పంచ్ పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిత్రం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాద య్య దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకుని దేవరకొండ డీఎస్పీ సోమశేఖర్, నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, గుర్రంపోడ్, చింతపల్లి, నాంపల్లి మండలాల ఎస్ఐలు శంకర్‌రెడ్డి, గౌరినాయుడు, ధనుంజయ్‌గౌడ్, దీపన్నలు ఘటన స్థలానికి వచ్చారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయమని మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. నింది తుడు రాములును శిక్షించాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని డీఎస్పీ హామీమేరకు వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
వివాదం రాజేసిన డీఈల అరెస్టు
హైదరాబాద్:తమపై దాడి చేశారంటూ తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు డీఈలను అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం వివాదానికి కారణమైంది. విద్యుత్ సౌధలో డీఈలుగా పనిచేస్తున్న సోమశేఖర్, ప్రభాకర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీ. ఉద్యోగులు ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేయడం సబబు కాదని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. విద్యుత్ సౌధలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో పోలీసులను భారీగా మోహరించారు. గతంలో తమపై దాడికి పాల్పడారంటూ టీ.ఉద్యోగులు ఫిర్యాదు మేరకు డీఈలను అరెస్టు చేశారు.