వివాదం రాజేసిన డీఈల అరెస్టు | controversy after de's arrest | Sakshi
Sakshi News home page

వివాదం రాజేసిన డీఈల అరెస్టు

Aug 30 2013 8:01 PM | Updated on Sep 1 2017 10:17 PM

తమపై దాడి చేశారంటూ తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు డీఈలను అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం వివాదానికి కారణమైంది.

హైదరాబాద్:తమపై దాడి చేశారంటూ తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు డీఈలను అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం వివాదానికి కారణమైంది. విద్యుత్ సౌధలో డీఈలుగా పనిచేస్తున్న సోమశేఖర్, ప్రభాకర్ లను  పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీ. ఉద్యోగులు ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేయడం సబబు కాదని  సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. విద్యుత్ సౌధలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.

 

దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో పోలీసులను భారీగా మోహరించారు. గతంలో తమపై దాడికి పాల్పడారంటూ టీ.ఉద్యోగులు ఫిర్యాదు మేరకు డీఈలను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement