విద్యుత్ షాక్ తో రైతుకు తీవ్రగాయాలు | farmer injures of vidyut shock in putlur | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్ తో రైతుకు తీవ్రగాయాలు

Sep 3 2015 7:07 PM | Updated on Oct 1 2018 4:01 PM

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు.

పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలు.. ప్రసాద్ అనే రైతు ట్రాన్స్‌ఫారం నుంచి తన పొలానికి లైన్ల మరమ్మతుల కోసం విద్యుత్ ప్రసారం నిలిపివేసేందుకు అధికారుల అనుమతి తీసుకున్నాడు. మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి రైతులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement