టిక్‌టాక్‌ వైద్యం ప్రాణం మీదకు తెచ్చింది

Family Fell Ill After Eating Datura Fruit To Control Corona - Sakshi

సాక్షి, ప్రకాశం : టిక్‌టాక్‌ వైద్యం ఓ ముగ్గురి ప్రాణం మీదకు తెచ్చింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ఉమ్మెత్తకాయను తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లిమల్లికి చెందిన ఓ కుటుంబం కొద్దిరోజులు క్రితం టిక్‌టాక్‌లో ఓ వీడియో చూసింది. ఉమ్మెత్తకాయను తింటే కరోనా సోకకుండా ఉంటుందని అందులో చెప్పటంతో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఉమ్మెత్తకాయను తిన్నారు. దీంతో వారు అస్వస్థతకు గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారిని చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిక్‌టాక్‌ వీడియో చూసి తాము మోసపోయామంటూ బాధితులు వాపోయారు.

చదవండి : దిండు లేకపోయుంటే పరిస్థితి ఏంటో!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top