దిండు లేకపోయుంటే పరిస్థితి ఏంటో! | Watch Video How Woman Plays Mario Kart At Home Using Treadmill And Basket | Sakshi
Sakshi News home page

దిండు లేకపోయుంటే పరిస్థితి ఏంటో!

May 16 2020 1:11 PM | Updated on May 16 2020 1:26 PM

Watch Video How Woman Plays Mario Kart At Home Using Treadmill And Basket - Sakshi

పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి ఈ వీడియోనూ ఉదాహరణగా చెప్పవచ్చు. లాక్‌డౌన్ సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది ఏది పడితే అది చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పైగా తాము చేసే ప్రతీ పనిని టిక్‌టాక్‌లో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా జెస్సీ రింగ్‌ అనే యువతి ట్రెడ్‌మిల్‌పై లాండ్రీ బాస్కెట్‌తో చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. ఆ వీడియోలో జెస్సీ తలకు హెల్మెట్‌ ధరించి లాండ్రీ బాస్కెట్‌లో కూర్చుని మొదటిసారి గంటకు 1 కిమీటర్‌ వేగంతో ట్రెడ్‌మిల్‌ నుంచి కిందకు జారింది.
(ఫుట్‌బాల్‌ను ర‌ఫ్ఫాడించింది, అదీ హీల్స్‌తో!)

అలా ట్రెడ్‌మిల్‌పై నుంచి జారే ముందు ప్రతీసారి గంటకు ఒక్కో కి.మీ వేగం పెరిగేలా మొత్తం 7 సార్లు టైమర్‌ను సెట్‌ చేసింది. దాంతో పాటు ట్రెడ్‌మిల్‌పై వేగం పెరిగే ప్రతీసారి కిందపడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే గోడకు సన్నని దిండులను పక్కాగా అమర్చుకుంది. అయితే ట్రెడ్‌మిల్‌పై లాండ్రీ బకెట్‌ గంటకు 7 మైళ్ల వేగంతో జారుతుండగా జెస్సీ ఒక్క సారిగా తలకిందులుగా పడి గోడకు వెళ్లి బలంగా గుద్దుకుంది. కాకపోతే గోడకు దిండు అడ్డుగా ఉండడంతో ఏం కాలేదు. ఈ వీడియోనూ జెస్సీ తన టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో దాదాపు ఒక్కరోజులోనే 12.4 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ' ఎందుకీ పిచ్చి పనులు'.. 'దిండు లేకపోయుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement