వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత | Famed violinist Ivaturi Vijayewara rao passes away | Sakshi
Sakshi News home page

వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత

Oct 18 2014 9:10 AM | Updated on Sep 2 2017 3:03 PM

వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత

వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత

ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో

విశాఖ : ప్రముఖ  వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇవటూరి స్వర్గస్తులైనారు. ఇవటూరి విజయేశ్వరరావు 1938, మే 29న విశాఖలో జన్మించారు. చూపు లేకపోయినా, ఎందరికో సంగీత పాఠాలు నేర్పి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నంలో సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది.

 

ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో  ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు స్వర్గీయ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రియశిష్యుల్లో ఇవటూరి విజయేశ్వరరావు ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement