విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని నక్కపల్లి వద్ద మంగళవారం రాత్రి పోలీసులమని చెప్పి లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యాదగిరి, అప్పారావు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.