నకిలీ నోట్ల ముఠా అరెస్ట్ | fake notes gang arrested | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Mar 17 2015 3:34 PM | Updated on Aug 20 2018 4:27 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నకిలీ నోట్లను చెలామణీ చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నకిలీ నోట్లను చెలామణీ చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన 11మంది సభ్యులు బృందంగా ఏర్పడి రాజమండ్రిలో నకిలీ నోట్లు మార్పిడి  చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే వారిలో ఏడుగురు పరారవ్వగా, నలుగురు పోలీసులకు దొరికారు. వీరి నుంచి రూ. 6లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి నకిలీ కరెన్సీని రాజమండ్రికి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement