మావోయిస్టుల పేరుతో దందా.. అరెస్ట్ | fake maoists demand money, arrested | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల పేరుతో దందా.. అరెస్ట్

Jan 13 2015 6:39 PM | Updated on Aug 20 2018 4:44 PM

గోపాలపురం మండలం దొండపుడిలో మావోయిస్టుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా వారిలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలోని  గోపాలపురం మండలం దొండపుడిలో మావోయిస్టుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా వారిలో ఒక వ్యక్తిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు.

వారు ఇంతకు ముందే డబ్బులు డిమాండ్ చేశారని వ్యాపారి తెలిపాడు. పశ్చిమ ఏజెన్సీలో ఇటీవలి కాలంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలా మావోయిస్టుల పేర్లతో వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి గ్యాంగునే పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement