నేత్రవైద్యుల సదస్సు ప్రారంభం | Sakshi
Sakshi News home page

నేత్రవైద్యుల సదస్సు ప్రారంభం

Published Sat, Sep 28 2013 5:05 AM

eye doctors camp started in warangal

కేఎంసీ, న్యూస్‌లైన్ :
 నేత్ర వైద్యుల 37వ రాష్ర్ట స్థాయి సదస్సు శుక్రవారం వరంగల్‌లో ప్రారంభమైంది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఆఫ్తాల్మిక్ అసోసియేషన్ చైర్మన్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగజాదవ్ పావురా లు ఎగురవేయడంతో పాటు అసోసియేషన్ పతాకా న్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సదస్సులో భాగంగా 750మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, 550మంది హాజరయ్యారని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఇందులో నకిరేకల్, నెల్లూరు, చిత్తూరు, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, హుగ్లీ నుంచి కూడా నేత్ర వైద్యనిపుణులు హా జరయ్యారని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు వరంగల్‌లో రాష్ర్ట సదస్సు నిర్వహించగా, ఇది మూడో సారి కావడం విశేషం.
 
 స్టాళ్ల ఏర్పాటు, సదస్సు
 రాష్ర్ట స్థాయి నేత్ర వైద్యుల సదస్సులో భాగంగా నేత్రవైద్యంలో అత్యాధునిక విధానాలు, మెళకువలపై పీజీ విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిపుణులు వివరించారు. రెండు స్క్రీన్లపై ఇటీవల జరిగిన ఆధునిక చికిత్సలను డాక్టర్ శరత్‌బాబు, డాక్టర్ పాండురంగజాదవ్ విద్యార్థులకు తెలిపారు. అంతేకాకుండా చికిత్సలో ఉపయోగించే పరికరాలతో పలు కంపెనీలు ప్రదర్శన ఏర్పాటుచేయగా, వైద్యులు ఆసక్తిగా వాటి వివరాలు తెలుసుకున్నారు. కాగా, సదస్సు రెండో రోజు శనివారం పలు అంశాలపై సెమినార్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా నేత్ర వైద్యుల అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఆఫ్తాల్మిక్ అసోసియేషన్ ప్రతినిధులు పాండురంగ జాదవ్, డాక్టర్ శరత్‌బాబుతో పాటు డాక్టర్ ఎ.రవీంద్ర, డాక్టర్ గిరిధర్, డాక్టర్ ప్రవీణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో డెలిగేట్స్ పాల్గొన్నారు.
 
 మార్మోగిన తెలం‘గానం’
 సదస్సు ప్రాంగణంలో తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కర ఫ్లెక్సీల వద్ద నిల్చుని పరిశీలించడం కనిపించింది.
 
 38వ సదస్సు రాజమండ్రిలో..
 నేత్ర వైద్యుల అసోసియేషన్ 38వ రాష్ర్ట స్థాయి సదస్సును వచ్చే ఏడాది రాజమండ్రిలో నిర్వహించనున్నా రు. అదే వేదికపై రాష్ర్ట అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ శరత్‌బాబు ప్రమాణ స్వీకారం చేసేలా తీర్మానిం చినట్లు తెలిసింది.

Advertisement
Advertisement