విజయనగరం తప్ప సీమాంధ్ర పరిస్థితి అదుపులోనే | 'Except vizianagaram, everything is under control' | Sakshi
Sakshi News home page

విజయనగరం తప్ప సీమాంధ్ర పరిస్థితి అదుపులోనే

Oct 8 2013 2:03 AM | Updated on Sep 1 2017 11:26 PM

సీమాంధ్ర జిల్లాలలో నడుస్తున్న ఆందోళనలు కొద్దిరోజుల్లోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిఘావర్గాలు కేంద్రానికి నివేదించాయి.

కేంద్రానికి నిఘావర్గాల నివేదిక


సీమాంధ్ర జిల్లాలలో నడుస్తున్న ఆందోళనలు కొద్దిరోజుల్లోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిఘావర్గాలు కేంద్రానికి నివేదించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన అనంతరం విజయనగరం జిల్లాలో జరిగిన  సంఘటనలతో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని, ఆ జిల్లాలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.

విజయనగరం,అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో హింసాత్మక ఘటనలేవీ చోటుచేసుకోలేదని స్పష్టంచేశాయి. మిగతా 11 జిల్లాల్లోనూ ఆందోళనలు తీవ్రంగానే ఉన్నప్పటికీ శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వివరించాయి. విజయనగరంలో పరిస్థితి చేయిదాడడంతో డీజీపీ బి.ప్రసాదరావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కూడా డీజీపీతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించకుంటే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని నిఘావర్గాలు  పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement