
లిక్కర్ స్కాంలో బొత్స సహా చాలామంది
లిక్కర్ స్కాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా చాలామంది ఉన్నారని, వారందరినీ బయట పెడతామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిండికేట్ల అక్రమార్జన లెక్కలు తేల్చాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ స్కాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా చాలామంది ఉన్నారని, వారందరినీ బయట పెడతామని అన్నారు. దీనిపై అవసరమైతే పునర్విచారణ చేయించాలని కేబినెట్కు సిఫార్సు చేస్తామని తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా గత పదేళ్లలో భారీ ఎత్తున జరిగిందని, ఇప్పటికి మొత్తం 12 వేల టన్నులను సీజ్ చేశారని పల్లె చెప్పారు. ఈ స్మగ్లింగ్ కేసులను వేగంగా విచారణ చేయిస్తామని, అందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాన్ పిక్, లేపాక్షి భూములను వెనక్కి తీసుకోవాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. న్యాయసలహాలు తీసుకున్నాక వాటిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.