అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా | Esther Anuhya Murder Case Enquiry Postponed to august 13 | Sakshi
Sakshi News home page

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

Jul 31 2014 3:17 PM | Updated on Sep 2 2017 11:10 AM

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది.

విజయవాడ: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. 13న తమ ఎదుట హాజరుకావాలని అనూహ్య తండ్రిని కోర్టు ఆదేశించింది. జనవరి 5న కుర్లాలో అదృశ్యమైన అనూహ్య, కంజూర్‌మార్గ్-భాండూప్‌లో శవమై తేలిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యా  ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement