breaking news
Singavarapu Esther Anuhya
-
ఏపీ యువతి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ : ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య (Singavarapu Esther Anuhya) హత్యకేసులో సుప్రీం కోర్టు (supreme court) సంచలన తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో నిందితుణ్ని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4,2014న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 2014,జనవరి 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించింది. ఎస్తేర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం తర్వాత.. హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎస్తేర్ హత్యకేసులో ముంబైకి చెందిన చంద్రభానుకు 2015లో ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేసింది.కేసు విచారణలో భాగంగా 2018లో ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సైతం సమర్ధించింది. అయితే హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ చంద్రభాను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా, మంగళవారం ఈ కేసును జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చంద్రభానే ఈ హత్య చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని అత్యున్నత న్యాయ స్థానం వ్యాఖ్యానించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసు విచారణలో కీలక తీర్పును వెలువరించింది. ఎస్తేర్ కేసులో చంద్రభాను నిర్ధోషి’ అని తేల్చేసింది.👉చదవండి : గురుమూర్తి మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసుడు -
అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా
విజయవాడ: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. 13న తమ ఎదుట హాజరుకావాలని అనూహ్య తండ్రిని కోర్టు ఆదేశించింది. జనవరి 5న కుర్లాలో అదృశ్యమైన అనూహ్య, కంజూర్‌మార్గ్-భాండూప్‌లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు.