చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం | Elephants crowd attack on crops at Chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం

Dec 25 2013 8:02 PM | Updated on Oct 4 2018 6:03 PM

జిల్లాలో బుధవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగలన్నీ గుంపులుగా వచ్చిగుడిపల్లి మండలం సంగనపల్లి ఎం కొత్తూరూ, కోడిగానిపల్లి, చిన్నగొల్లపల్లి గ్రామ శివారులోని పంటపోలాలపై దాడులు చేశాయి.

చిత్తూరు: జిల్లాలో బుధవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగలన్నీ గుంపులుగా వచ్చిగుడిపల్లి మండలం సంగనపల్లి ఎం కొత్తూరూ, కోడిగానిపల్లి, చిన్నగొల్లపల్లి గ్రామ శివారులోని పంటపోలాలపై దాడులు చేశాయి. భయంకరంగా ఘీంకారాలు చేస్తూ పంట పోలాలను ధ్వంసం చేశాయి. దీంతో సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖా అధికారులు స్పందించి గ్రామస్తులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ దండోరా వేయిస్తున్నారు. కాగా, కుప్పం వేపనపల్లి మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement