విద్యుత్ ఫ్రాంైచె జీల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సీతంపేట మహిళా సమాఖ్య జాతీయ స్థాయిలో రజత పతకం అందుకుంది.
విద్యుత్ సేవలకు రజత హారం.
Feb 5 2014 3:02 AM | Updated on Sep 5 2018 2:25 PM
సీతంపేట, న్యూస్‌లైన్: విద్యుత్ ఫ్రాంైచె జీల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సీతంపేట మహిళా సమాఖ్య జాతీయ స్థాయిలో రజత పతకం అందుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు జి.సరోజిని, కె.వరలక్ష్మి సిల్వర్ మెడల్‌ను అందుకున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సిన్హా, జాయింట్ సెక్రటరీ జ్యోతి ఆరోరాలు మహిళా సంఘాలను ప్రశంసించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ పిచ్చయ్య కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement