మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌

By election notification for three MLC positions - Sakshi

జారీ చేసిన ఎన్నికల సంఘం  

14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 

16న నామినేషన్ల పరిశీలన 

ఉపసంహరణకు గడువు 19వ తేదీ..అవసరమైతే 26న పోలింగ్‌

సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురు సభ్యులు (కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి) ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి వివరాలిలా ఉన్నాయి..
- బుధవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 14తో ముగుస్తుంది. 
16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 
ఈ నెల 19వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 
ఈ స్థానాలకు అవసరమైతే ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుంచి ఓట్ల లెక్కింపు.
ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ ఆఫీసరుగా పి.బాలకృష్ణమాచార్యులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసరుగా పి.వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top