నేటితో ముగియనున్న ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు | Ed.CET 2014: Last date for application today | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు

May 6 2014 2:57 AM | Updated on Sep 2 2017 6:58 AM

రాష్ట్రవ్యాప్తంగా బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్షకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తులకు గడువు మంగళవారంతో ముగియనుంది.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్షకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తులకు గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 1,67,093 దరఖాస్తులు వచ్చాయని, ఆసక్తి ఉన్నవారు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రవేశ పరీక్షకు హాజరై, అర్హత సాధించిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం అందుతుందని చెప్పారు. ఈ పరీక్ష 30న జరగనుంది. వివరాలకు 83329 48791, 76710 22096 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement