తూర్పు డెల్టాకు తాగునీరు విడుదల | East Delta Press Release | Sakshi
Sakshi News home page

తూర్పు డెల్టాకు తాగునీరు విడుదల

Jun 26 2014 1:01 AM | Updated on Sep 2 2017 9:23 AM

కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

విజయవాడ : కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ కృష్ణా మెయిన్ కెనాల్ వద్ద నీటిపారుదల శాఖ తూర్పు డెల్టా డివిజన్ చీఫ్ ఇంజినీర్ సాంబయ్య లాంఛనంగా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

తొలి దశగా 500 క్యూసెక్‌ల నీటిని విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నీటి ఒరవడిని దశలవారీగా పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రామకృష్ణ, తూర్పు డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement