సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళన | DWCRA Women protests at Sub Collector Office, Vijayawada | Sakshi
Sakshi News home page

సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళన

Jul 23 2014 1:09 PM | Updated on Aug 14 2018 3:48 PM

ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల డ్వాక్రా మహిళలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

విజయవాడ: ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల డ్వాక్రా మహిళలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ బుధవారం విజయవాడ నగరంలో డ్వాక్రా మహిళలు కదంతొక్కారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలకు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement