రూ 9 కోట్లతో తాగునీటి సౌకర్యం | drinking water facility with Rs 9 crore | Sakshi
Sakshi News home page

రూ 9 కోట్లతో తాగునీటి సౌకర్యం

Dec 19 2013 3:55 AM | Updated on Sep 2 2017 1:45 AM

ఐటీడీఏ పరిధిలోని వివిధ మం డలాల్లో రూ.9 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్ తెలిపారు.

సీతంపేట, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని  వివిధ మం డలాల్లో రూ.9 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్ తెలిపారు. ఐటీడీఏలో ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ  ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించి, ఆయన మాట్లాడారు. గిరిజన గ్రామాలకు తాగునీటి వసతుల కల్పనకు రూ 4.5 కోట్లు, ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో తాగునీరు అందించేందుకు రూ 4.5 కోట్లు వెచ్చించనున్నామని చెప్పారు. ఎక్కడెక్కడ తాగునీటి సదుపాయం అవసరమో గుర్తించి, వీటీడీఏల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.

 రక్షిత పథకాలు ఎక్కడెక్కడ పాడయ్యాయో..వెంటనే సర్వే చేయాలన్నారు. అవసరమైన చోట గ్రావిటేషన్ ఫ్లోలు నిర్మించాలని చెప్పారు. అలాగే  ఐటీడీఏలో తాగునీటి సెల్ ఏర్పాటు చేయనున్నామని ఎక్కడ ఇబ్బంది ఎదురైనా.. 9573844577 నంబర్‌కు ఫోన్ చేయాలని గ్రామీణులకు సూచించారు. ఐఏపీలో రూ  23 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. వీటిలో రూ.30 లక్షలతో కెరీర్ గెడైన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అలాగే కొన్ని బీటీ రోడ్లు నిర్మించనున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గార రవణమ్మ, డీఈఈలు  శాంతీశ్వరరావు, కుమార్, మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement