చంద్రబాబు పాలన మోసపూరితం

Don't Fall To Chandrababu Magics Again In This Election - Sakshi

సాక్షి, ఒంటిమిట్ట (వైఎస్సార్‌) : చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ కొత్త నాటకానికి తెరలేపారని, బాబుది మోసపూరిత పాలన అని వైఎస్సార్‌ సీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి విమర్శించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడా మల్లికార్జున రెడ్డి, మేడా మధుసూదన్‌ రెడ్డి మండలంలోని సాలాబాద్, మలకాటిపల్లె, బందారుపల్లె, కుడమలూరు గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రజలకు నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని, వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరత్నాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 

130 సీట్లలో విజయం తథ్యం 
 సాధారణ ఎన్నికల్లో వైఎసార్‌సీపీ 130 అసెంబ్లీ సీట్లలో విజయం సాధిస్తుందని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని మాచుపల్లె, తురకపల్లె, ఉక్కాయపల్లె, శాంతినగర్, ఎస్సీకాలనీలు, సంటిగారిపల్లె, మూలపల్లె గ్రామాల్లో బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, మేడా మధుసూదన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ నీలకంఠారెడ్డి, రైతు విభాగం మండల కన్వీనర్‌ పల్లె సుబ్బారామిరెడ్డి, జిల్లా కార్యదర్శి జ్యోతి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌. శ్రీనివాసులరెడ్డి, పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top