
కేంద్రపాలిత ప్రాంతం అంటే ఒప్పుకోం: ఎంపి పొన్నం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా ఆపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర నేతల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా ఆపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర నేతల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎంపి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండేవారికి ఎవరికీ ఎలాంటి హానీ జరగదని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డున ఉందని చెప్పారు. అందువల్ల దానిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే తాము ఒప్పుకునేదిలేదని ఆయన స్పష్టం చేశారు.