ఏపీ గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్‌

Doctorate Awarded To AP Governor Biswabhusan Harichandan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంజాబ్‌లోని దేశ్‌ భగత్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సామాజిక, శాస్త్ర రంగాల్లో  ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్టు ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది. న్యాయ నిపుణుడిగా, ప్రజాప్రతినిధిగా, రచయితగా ఆయన సమాజానికి విశేష సేవలు అందించారని కొనియాడింది. పంజాబ్‌లోని మండీ గోబింద్‌గర్హ్‌లోని దేశ్‌ భగత్‌ విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా  ఆ విశ్వవిద్యాలయ కులపతి జోరాసింగ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు శుక్రవారం డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం ఉండేలా యువత ప్రయత్నించాలని ఉద్భోదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top