న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి | Discussion on feasibility : Jaipal Reddy | Sakshi
Sakshi News home page

న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి

Nov 17 2013 3:16 PM | Updated on Sep 2 2017 12:42 AM

న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి

న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ: జైపాల్రెడ్డి

రాష్ట్ర విభజనకు సంబంధించి న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి న్యాయాన్యాయాలు, సాధ్యాసాధ్యాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు  కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. తన నివాసంలో తెలంగాణ కేంద్ర మంత్రులు, నేతలతో జరిగిన సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర సూచించిన 11 అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించినట్లు తెలిపారు. అన్ని విషయాలపై తమలో కూడా మేథోమథనం జరిగినట్లు తెలిపారు.

 ఉమ్మడి ఉద్దేశాలను దృష్టిలోపెట్టుకొని ఒక నోట్ తయారు చేసినట్లు చెప్పారు. రేపు తెలంగాణకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులం రాష్ట్ర విభజనకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)ను కలుస్తామని చెప్పారు. అయితే తమకు  అర్ధగంట మాత్రమే సమయం ఇచ్చినందున తమ ఉమ్మడి అభిప్రాయాలను రాతపూర్వకంగా  జిఓఎంకు ఇస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement