కోస్గిలో ప్రబలిన అతిసార: ఇద్దరు మృతి | diarrhoeal diseases spreded in kurnool distirict | Sakshi
Sakshi News home page

కోస్గిలో ప్రబలిన అతిసార: ఇద్దరు మృతి

Feb 25 2015 9:24 AM | Updated on Sep 2 2017 9:54 PM

కర్నూలు జిల్లా కోస్గి మండలంలో అతిసార పంజా విసిరింది.

కర్నూలు : కర్నూలు జిల్లా కోస్గి మండలంలో అతిసార పంజా విసిరింది. నాలుగు రోజుల వ్యవధిలోనే 100 మందిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. పరిస్థితి విషమించి గ్రామానికి చెందిన రాగమ్మ(75) అనే మహిళ మంగళవారం మృతిచెందగా,  సుగమ్మ(60) అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.

తాగు నీరు సరఫరా చేసే పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరడం, విషమించిన పారిశుద్ధ్య పరిస్థితులే వ్యాధి పెచ్చుమీరటానికి కారణమని భావిస్తున్నారు.  అస్వస్థతకు గురైన వారు కోస్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
(కోస్గి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement