తిరుమలకు పోటెత్తిన భక్తులు | Devotees Heavy Rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Jan 1 2015 1:08 AM | Updated on Sep 2 2017 7:02 PM

ఏకాదశి దర్శనం కోసం తిరువులలో బుధవారం భక్తులు పోటెత్తారు.

క్యూలోకి అనుమతించాలని భక్తుల ధర్నా
సర్వ దర్శన క్యూల్లో తోపులాట
 
 సాక్షి, తిరుమల: ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో బుధవారం భక్తులు పోటెత్తారు. కొండ కిక్కిరిసిపోరుుంది. రాత్రి 8 గంటలకే అన్ని క్యూలు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా  క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు కొందరు సామూహికంగా  శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొం దరు రాళ్లతో తాళాలను పగుల గొట్టారు. క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు.
 
 కొందరు గోవింద మాల ధరించిన భక్తులు ఏకంగా రోడ్డుపై బైటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను క్యూలోకి అనుమతించాలని పట్టుబట్టారు. వాహనాలకు అడ్డు తగిలారు. అర్ధరాత్రి వరకు టీటీడీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి 11 గంటలకు టీటీడీ నిర్ణయించిన దానికంటే అదనంగా శంకుమింట్ట కూడలి నుంచి పాపవినాశనం రోడ్డులోని నందకం అతిథిగృహం వరకు క్యూ విస్తరించింది.  అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటలు చీవులదండును తలపించాయి.
 
 క్యూలైన్‌లోకి అనుమతించాలని భక్తుల ధర్నా
 ఉదయుం 5 గంటల నుంచే భక్తులు సర్వదర్శనం క్యూలోకి రావడం మొదలు పెట్టారు. అప్పటికే అధికారులు గేట్లు మూసివేయుడంతో  భక్తుల ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి దాటాక తమను సర్వదర్శనం క్యూలోకి అనుమతించాలని తొమ్మిది నుంచి 11 గంటల మధ్య భక్తులు ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భక్తులతో మాట్లాడారు. దర్శనానికి ఎంత ఆలస్యమైనా వేచి ఉంటామని భక్తులు హామీ ఇవ్వడంతో క్యూ ద్వారా రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతించారు.  
 
 తోపులాట .. స్వల్పగాయూలు
 వురోవైపు శంకుమిట్ట జనరేటర్ వద్ద  వేకువ జామునుంచి ఉదయం పది గంటల వరకు వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా క్యూల్లోకి వెళ్లేందుకు ఎగబడ్డారు. తోపులాట చోటుచేసుని గేట్లు విరిగిపోయూరుు. కొందరు భక్తులు కమ్మీలు పట్టుకుని పైకి ఎక్కారు. దీంతో కంచె కూలి భక్తులు కింద పడ్డారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
 
 శోభాయమానంగా ముస్తాబు
 శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహద్వారం నుంచి గర్భాలయం వరకు పుష్పాలు, పండ్లతో అలంకరించారు. విద్యుత్ కాంతుల్లో ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది.
 
 నేడు, రేపు ప్రత్యేక దర్శనాల్లేవు
 గురువారం ఏకాదశి, శుక్రవారం ద్వాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేక దర్శనాల్లేవు. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు, సుపథం దర్శనాలు రద్దు చేశారు. శ్రీవారినిత్య, వారపు ఆర్జిత సేవలనూ రద్దు చేశారు. ద్వాదశి కోసం ఆన్‌లైన్‌లో కేటాయించిన రూ. 300 టికెట్లు కలిగిన పది వేల మందికి మాత్రమే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దర్శనం కల్పిస్తారు.
 
 తిరుమలలో న్యాయమూర్తులు
 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, రంజన్ గొగోయ్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంజయ్‌కిషోర్, గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్‌రావు  ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement