రన్‌వేపై నిర్బంధమా?: ఉండవల్లి | Detained on the runway? - undavalli | Sakshi
Sakshi News home page

రన్‌వేపై నిర్బంధమా?: ఉండవల్లి

Jan 28 2017 2:01 AM | Updated on Mar 23 2019 9:10 PM

రన్‌వేపై నిర్బంధమా?: ఉండవల్లి - Sakshi

రన్‌వేపై నిర్బంధమా?: ఉండవల్లి

దేశంలో ఇప్పటి వరకు రాస్తారోకో, రైల్‌రోకోలే తెలుసునని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని ఫ్లైట్‌...

రాజమహేంద్రవరం: దేశంలో ఇప్పటి వరకు రాస్తారోకో, రైల్‌రోకోలే తెలుసునని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని ఫ్లైట్‌ రోకో చూశామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంక్షిస్తూ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విమానాశ్రయం రన్‌వే మీద నిర్బంధించడాన్ని ఆయన తప్పుపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉగ్రవాదిని కూడా విమానాశ్రయం లాంజ్‌ వద్దకు తీసుకొచ్చిన తర్వాతే అరెస్టు చేస్తారని, కానీ మూడు గంటలపాటు రన్‌వే మీద నుంచి జగన్‌ను బయటకు రానీయకుండా అటు నుంచి అటే హైదరాబాద్‌ పంపడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో పౌర హక్కులున్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement