మల్లన్న సేవలో డిప్యూటీ స్పీకర్ | Deputy Speaker Mandali Buddha Prasad visits Srisailam | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో డిప్యూటీ స్పీకర్

Sep 29 2015 6:12 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

శ్రీశైలం : శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ సాగర్‌బాబు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.

స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement