నడి రోడ్డుపై ప్రసవం | Delivery on the road | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై ప్రసవం

Sep 1 2015 1:25 AM | Updated on Sep 3 2017 8:29 AM

నడి రోడ్డుపై ప్రసవం

నడి రోడ్డుపై ప్రసవం

నగరంలో నిండు గర్భిణి నడి రోడ్డుపైనే ప్రసవించింది

నగరంలో నిండు గర్భిణి నడి రోడ్డుపైనే ప్రసవించింది. చిట్టినగర్ సొరంగం రోడ్డులో సోమవారం ఈ ఘటన జరిగింది. భర్త ఈసూబ్‌తో కలిసి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గర్భిణి షేక్ గౌష్య (21).. ఇటీవల నెలలు నిండటంతో పాపాయమ్మ వీధిలోని చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం ఉదయం 6.30 సమయంలో గౌష్యకు నొప్పులు రావడంతో కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు.

ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చేసరికే నొప్పులు బాగా ఎక్కువవటంతో ఆమె రోడ్డుపైనే కుప్పకూలింది. దీంతో చుట్టుపక్కల మహిళలు గౌష్య చుట్టూ చీరలు పట్టుకుని నిలుచున్నారు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానిక ఆర్‌ఎంపీ అక్కడికి చేరుకొని ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.     - చిట్టినగర్
 

Advertisement
 
Advertisement
Advertisement