పోగొట్టుకున్న భూమి పత్రాల అప్పగింత | Delivery of documents to the land | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న భూమి పత్రాల అప్పగింత

May 5 2018 1:14 PM | Updated on May 5 2018 1:15 PM

Delivery of documents to the land - Sakshi

శర్మకు డాక్యుమెంట్లు అందజేస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై వాసుదేవ్‌

విజయనగరం టౌన్‌ : పట్టణంలోని కానుకుర్తివారివీధికి చెందిన శర్మ పని నిమిత్తం ఇంటి నుంచి తన 17 ఎకరాలకు చెందిన భూమి ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తీసుకుని  వెళ్తుండగా మార్గమధ్యలో అవి ఎక్కడో  పడిపోయాయి. విషయాన్ని సాయంత్రం నాలుగు  గంటల సమయంలో గమనించి ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న బీట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో మయూరీ జంక్షన్‌ బీట్‌ పరిసర ప్రాంతాల్లో  కొందరు యువకులు  డాక్యుమెంట్లను గుర్తించి పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్‌ ఎస్సై వాసుదేవ్‌  వెంటనే విషయాన్ని బాధితుడిని రప్పించి డాక్యుమెంట్లు అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement