'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర'' | Dadi Veerabhadra Rao fired on N Kiran Kumar Reddy on 'Jai Samaikyandhra' Party | Sakshi
Sakshi News home page

'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర''

Mar 10 2014 9:25 PM | Updated on Jul 29 2019 5:31 PM

'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర'' - Sakshi

'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర''

జై సమైక్యాంధ్ర' పేరుతో రాజకీయ పార్టీ ఆరంభించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు నిప్పులు చెరిగారు.

విశాఖపట్నం : 'జై సమైక్యాంధ్ర' పేరుతో రాజకీయ పార్టీ ఆరంభించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలను పాటించి.. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని దాడి విమర్శించారు. 
 
రాష్ట్ర విభజనకు కారణమైన కిరణ్ మరోసారి ప్రజలను మోసం చేయడానికి జై సమైక్యాంధ్ర అంటూ సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కిరణ్ కు ప్రజలు  బుద్ది చెబుతారని ఆయన అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు సమక్షంలో 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement