తీవ్ర తుపానుగా మారిన 'మాదీ' | Cyclone Madi turns into a 'Severe Cyclone' | Sakshi
Sakshi News home page

తీవ్ర తుపానుగా మారిన 'మాదీ'

Dec 9 2013 9:29 AM | Updated on Sep 2 2017 1:25 AM

తీవ్ర తుపానుగా మారిన 'మాదీ'

తీవ్ర తుపానుగా మారిన 'మాదీ'

నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫానుగా మారింది.

విశాఖ : నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో... దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మాదీ తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపింది. దీంతో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement