ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం | Custom Officials seized half kg gold at RGI Airport Shamshabad | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం

Feb 5 2014 9:07 AM | Updated on Sep 26 2018 6:32 PM

ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం - Sakshi

ఎయిర్పోర్ట్లో అరకిలో బంగారం స్వాధీనం

బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఖాజా అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఖాజా అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఖాజా హైదరాబాద్ చేరుకున్నాడు.

 

అనంతరం ఖాజా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో కస్టమ్స్ అధికారులు అనుమానం వచ్చింది. వెంటనే  అతడిని అదుపులోకి తీసుకుని, తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా ఖాజా వద్ద నుంచి అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం అతడిని ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement