సీపీఎస్‌ రద్దు చేయాలని వినతి | CPS Employees Meet YS Jagan at Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు చేయాలని వినతి

Dec 9 2018 6:31 AM | Updated on Dec 9 2018 6:31 AM

CPS Employees Meet YS Jagan at Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం: సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని జిల్లా సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 1.82 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్‌ విధానంలో ఉన్నారని, దీనివల్ల ఇప్పటికే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌పై అధ్యయనానికి కమిటీ వేసిందని, ఇదంతా కాలయాపన కోసమేనన్నారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ ఇప్పటికే సీపీఎస్‌ రద్దుకు సంబంధించి హామీ ఇచ్చానని గుర్తు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement