'ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలకు నష్టం' | CPM leader punyavathi fires on TDP government | Sakshi
Sakshi News home page

'ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలకు నష్టం'

Apr 9 2015 12:04 PM | Updated on Aug 13 2018 8:10 PM

'ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలకు నష్టం' - Sakshi

'ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలకు నష్టం'

ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి ఎద్దేవా చేశారు.

విజయనగరం: ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి ఎద్దేవా చేశారు. దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవలంభిస్తున్న విధానాలే కారణమని పుణ్యవతి అన్నారు. ఆమె గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనల వల్ల ఒరిగిందేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని గుర్తు చేశారు. ప్రజావ్యతిరేక విధానాల వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పుణ్యవతి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని నెలలైనా నీటి పారుదల రంగాన్ని ప్రోత్సహించడంలో విఫలమవడం వల్ల రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పుణ్యవతి ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement