‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’ | CPI Ramakrishna comments Visakha Land Scam | Sakshi
Sakshi News home page

‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’

Jun 5 2017 6:58 PM | Updated on Aug 13 2018 7:30 PM

‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’ - Sakshi

‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’

విశాఖ జిల్లాలో భూబకాసురులు పెట్రేగిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.

అమరావతి: విశాఖ జిల్లాలో భూబకాసురులు పెట్రేగిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ రూరల్, భీమునిపట్నం మండలాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. మధురవాడలో 10 ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నాయకుడు మదమంచి రామకృష్ణ తప్పుడు పట్టా సృష్టించి అమ్మేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారాయని చెప్పారు.

విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు సంబంధించిన భూ రికార్డులు టాంపరింగ్ అయినట్లు జిల్లా కలెక్టర్ పత్రికాముఖంగా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. భూబకాసురులపై, సహకరించిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement