కుటుంబ కలహాలతో దంపతులు శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కొయ్యలకుంట(వైఎస్సార్ జిల్లా): కుటుంబ కలహాలతో దంపతులు శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా కొయ్యలకుంట మండలం అంకంపల్లె గ్రామంలో జరిగింది. వివరాలు.. అంకంపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్, కల్యాణి దంపతులు గత కొంత కాలంగా కుటుంబకలహాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఇంటిలో ఉన్న శనగమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన స్థానికులు దంపతులను మెరుగైన వైద్యం కోసం కడప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతానికి దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.