‘దేశం’ పాలనలో రక్షణ కరువు | 'Country' Under the Protection of the drought | Sakshi
Sakshi News home page

‘దేశం’ పాలనలో రక్షణ కరువు

Jul 30 2015 2:00 AM | Updated on May 29 2018 6:01 PM

రిషితేశ్వరి ఆత్మహత్యను నిరసిస్తూ వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కడప కార్పొరేషన్: రిషితేశ్వరి ఆత్మహత్యను నిరసిస్తూ వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం  కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి కావడం దారుణమన్నారు.  రిషితేశ్వరి మరణించి 22 రోజులవుతున్నా  నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడాన్ని బట్టి పోలీసు యంత్రాంగం ఉందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కేసును నీరుగార్చడానికే  ప్రభుత్వం కమిటీ వేసిందని ధ్వజమెత్తారు. కేసు విచారణ కోసం నియమించిన కమిటీలో పలు ఆరోపణలు ఉన్న విక్రమపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ వీరయ్యను నియమించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో విద్యార్థులు ఈయన వ్యవహార శైలిపై ఆందోళనలు నిర్వహించారన్నారు. అలాగే కమిటీలోని మిగతా సభ్యులు కూడా టీడీపీకి అనుకూలమైన వ్యక్తులేనని ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
 
  రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి కే సును హైకోర్టు జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారు ఆర్టీసీ బస్టాండు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మహ్మద్ అలీ, నాగార్జున రెడ్డి, నిత్యపూజయ్య, అబ్బాస్, సొైహైల్, షఫీ, పెంచలయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి, రాజ, రమణ, వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement