బ్యాంకు రుణం తీర్చడానికి దొంగనోట్లు!! | counterfeit currency identified in badvel bank | Sakshi
Sakshi News home page

బ్యాంకు రుణం తీర్చడానికి దొంగనోట్లు!!

Apr 3 2014 12:08 PM | Updated on Jun 4 2019 6:31 PM

వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. ఏకంగా లక్షా అరవైవేల రూపాయల దొంగనోట్లను కస్టమర్ తీసుకురావడంతో బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు.

వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. ఏకంగా లక్షా అరవైవేల రూపాయల దొంగనోట్లను కస్టమర్ తీసుకురావడంతో బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు. బంగారం కుదువపెట్టి తీసుకున్న అప్పు తీర్చడానికి వచ్చిన వ్యక్తి.. మొత్తం 2 లక్షల రూపాయలు తీసుకురాగా, అందులో 1.60 లక్షల రూపాయలు దొంగనోట్లు అని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ నోట్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

అయితే, సదరు వినియోగదారుడు తనకు తెలిసే ఈ దొంగనోట్లు తీసుకొచ్చాడా.. లేక అతడికి తెలియకుండా ఎవరైనా అంటగట్టారా అనే విషయం ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఎన్నికల సందర్భంలో కొన్ని పార్టీలు దొంగనోట్లను చెలామణి చేస్తుండటంతో ఎవరైనా ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. లేకపోతే అంత ధైర్యంగా దొంగనోట్లను ఏకంగా బ్యాంకు రుణం చెల్లించడానికి తీసుకొచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement