
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209 చేరింది. కాగా సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,200 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. (రెండు లక్షలకు చేరువలో..)