
రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కనగల దేవకృప డేవిడ్‌రాజు(56) రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డేవిడ్‌రాజు మృతదేహం వద్ద ఉన్న రివాల్వర్‌ను గుర్తించారు. పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో తలకు కుడివైపున కాల్చుకోవడం వల్ల డేవిడ్ రాజు అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని డీసీపీ ప్రవీణ్, ఈస్ట్‌జోన్ ఏసీపీ వి.విజయభాస్కర్ సందర్శించారు. కాగా, జీవితంలో విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబానికి అండగా నిలవాలని సూసైడ్‌నోట్‌లో డేవిడ్‌రాజు పేర్కొన్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, పోలీస్‌స్టేషన్‌లో కేసు ప్రాపర్టీ డబ్బుల అవకతవకలపై డేవిడ్‌రాజును బాధ్యుడ్ని చేయడంతో పాటు ఆ నగదును చెల్లించాలంటూ స్టేషన్ అధికారి చేస్తున్న ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.