breaking news
purushottampatnam
-
రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కనగల దేవకృప డేవిడ్‌రాజు(56) రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం మండలంలోని దావాజిగూడెంలో నివసిస్తున్న డేవిడ్‌రాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్లుగా రైటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు హాజరైన ఆయన కొద్దిసేపటి తర్వాత బైక్‌పై బయటకువెళ్లాడు. కాగా, 10.30 గంటల సమయంలో పురుషోత్తపట్నం–ముస్తాబాద గ్రామాల మధ్య పొలాలకు వెళ్లే రోడ్డులో డేవిడ్‌రాజు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డేవిడ్‌రాజు మృతదేహం వద్ద ఉన్న రివాల్వర్‌ను గుర్తించారు. పాయింట్‌బ్లాంక్ రేంజ్లో తలకు కుడివైపున కాల్చుకోవడం వల్ల డేవిడ్ రాజు అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని డీసీపీ ప్రవీణ్, ఈస్ట్‌జోన్ ఏసీపీ వి.విజయభాస్కర్ సందర్శించారు. కాగా, జీవితంలో విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబానికి అండగా నిలవాలని సూసైడ్‌నోట్‌లో డేవిడ్‌రాజు పేర్కొన్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, పోలీస్‌స్టేషన్‌లో కేసు ప్రాపర్టీ డబ్బుల అవకతవకలపై డేవిడ్‌రాజును బాధ్యుడ్ని చేయడంతో పాటు ఆ నగదును చెల్లించాలంటూ స్టేషన్ అధికారి చేస్తున్న ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. -
పోలవరానికి గండి కొట్టేందుకే ‘పురుషోత్తపట్నం’
రాయవరం : పోలవరం ప్రాజెక్టుకును అడ్డుకునేందుకు నాడు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చేసిన ప్రతిపాదనలనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి సంఘాల రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మండిపడ్డారు. శనివారం వారిక్కడ విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.1,600 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏ మేరకు రైతులకు ప్రయోజనాలను చేకూర్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడంలో భాగంగానే చంద్రబాబు మరో ఎత్తుగడకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించా రు. రూ.1,600 కోట్లతో సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ప్రతిపాదిస్తున్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిలో నీటిని ఏలేరు కాలువ ద్వారా విశాఖపట్నానికి తరలించాలని యోచిస్తున్నట్టు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కట్టవద్దంటూ గతంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలంగాణ వాసులు కూడా నానాయాగీ చేశారని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు అవసరం లేకుండా రెండు ఎత్తిపోతల పథకాలు కట్టుకోవాలని గతంలో వారు చేసిన డిమాండ్‌నే ఇప్పుడు చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన స్పిల్‌వే నిర్మాణ పనులకు రూ.4,700 కోట్లను ట్రాన్స్‌టాయ్‌కు కంపెనీకి అప్పగించారని తెలిపారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ఖర్చును స్పిల్‌వే నిర్మాణానికి కేటాయిస్తే, పోలవరం ప్రాజెక్టు మొదటి భాగం పూర్తవుతుందని వివరించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా, మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత మంతెన అచ్యుతరామరాజు ఉన్నారు.