విభజన సమస్యలకు కాంగ్రెసే కారణం: వెంకయ్య | Congress party is the reason for State bifurcation issues: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

విభజన సమస్యలకు కాంగ్రెసే కారణం: వెంకయ్య

Aug 18 2014 6:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

విభజన సమస్యలకు కాంగ్రెసే కారణం: వెంకయ్య - Sakshi

విభజన సమస్యలకు కాంగ్రెసే కారణం: వెంకయ్య

రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీనేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీనేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లిద్దరూ చర్చలు జరపడం శుభపరిణామమని ఆయన అన్నారు. 
 
ఇరు రాష్ట్రాలకు కేంద్రం సహకారం ఉంటుందని,  త్వరలోనే పార్లమెంటరీ కమిటీ ఓ ప్రకటన చేస్తుందని ఆయన అన్నారు. హిందూ అంటే మతం కాదు..దేశ సంస్కృతికి సంకేతం అని వెంకయ్య స్పష్టం చేశారు. హిందూ శబ్దాన్ని సంకుచిత మనస్తత్వంతో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
నవంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయని,  శీతాకాల సమావేశాల్లోనే బీమా బిల్లులు పాస్ చేస్తామని ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement