కాంగ్రెస్ నాయకుడు వెంకయ్య మృతి | Congress leader M Venkaiah death | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నాయకుడు వెంకయ్య మృతి

Mar 15 2016 12:55 AM | Updated on Mar 18 2019 7:55 PM

చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్. వెంకయ్య...........

ఆనందపేట (గుంటూరు) : చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్. వెంకయ్య సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఎం.ముత్యాలరావు వెల్లడించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గల మహత్మా గాంధీ సమాధిని సందర్శించుకొని బయటకు వస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే లోక్‌నాయక్ తిలక్ అసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ ఖర్చులతో ఆయన మృతదేహన్ని విమానంలో మంగళవారం గుంటూరుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

వెంకయ్య మృతికి పీసీసీ అధ్యక్షుడు ర ఘువీరరెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, గుంటూరు జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ కనుమూరి బాపిరాజు, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు, మాజీ శాసనసభ్యులు షేక్ మస్తాన్ వలి, చదలవాడ జయరాంబాబు, షేక్ మౌలాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement