అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం

సాక్షి,అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘మన జాతీయ పతాక రూపశిల్పి.. స్వాతంత్ర్య పోరాట యోధుడు పింగళి వెంకయ్యగారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యగారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. (చెరకు రైతుల బకాయిలు తీర్చాలి)
అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ‘గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి.. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి