ఆర్థికశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting With Finance Department Officials | Sakshi
Sakshi News home page

ఆర్థికశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Jun 22 2019 4:16 PM | Updated on Jun 22 2019 6:46 PM

CM YS Jagan Review Meeting With Finance Department Officials - Sakshi

సాక్షి, తాడేపల్లి : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సమీక్ష కొనసాగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వివేది, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement