
సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరుపుతున్నారు.
సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈ సమావేశం ప్రారంభమైంది. సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ రెండోసారి సీఆర్‌డీఏ సమీక్షా సమావేశం జరుపుతున్నారు. జూన్ 26న తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.