కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం

CM YS Jagan Mohan Reddy Wonderful Gesture While Giving Medal To Police - Sakshi

సాక్షి, అమరావతి: ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సైగ చేస్తే చాలు ఆదేశాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్‌ అధికారికి పతకాన్ని అలంకరించారు. సీఎంకు శాల్యూట్‌ చేసే సమయంలో ఆ పతకం పోలీస్‌ అధికారి నుంచి జారి పడింది. దీనిని గమనించకుండా ఆ అధికారి కవాతు చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జారిపడిన ఆ పతకాన్ని సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ వైరల్‌ కావడంతో సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top